WhatsApp Governance: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

WhatsApp Governance: గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు దూపాడు గ్రామ సర్పంచ్ ఎనిబేర అనూష గారి (Sarpanch Anusha) , ఆళ్ళ నాసర్ రెడ్డి గారు, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి, వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మెరుగైన సేవలు గురించి ప్రజలకు అవగాహన చేసుకోవాలని దానిని ఉపయోగించమని చెప్పారు.

🔸 నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు.

🔸 ప్రజలకు 161 సేవలు వాట్సాప్ లో అందుబాటులోకి.

🔸 ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా వాట్సాప్ లోనే సేవలు పొందొచ్చు.

🔸 9552300009 నెంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు పొందొచ్చు

గూడూరి ఎరిక్షన్ బాబు (Erixion Babu) యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి.

వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది.

దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు.

వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *