Erixion Babu: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు పంచాయతీ శివాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న NTR భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా శివాపురంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు (Erixion Babu) స్వయంగా పాల్గొని పింఛన్లను పంపిణి చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో పెంచిన NTR భరోసా పింఛన్లను పంపిణి చేశారు.
ఉదయం 10 గంటలకే యర్రగొండపాలెం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందితో కలిసి 90% పింఛన్లను పంపిణీ చేసామన్నారు. వృద్దాప్య, వితంతు పింఛన్ దారులకు ₹4వేలు, వికలాంగులకు ₹6వేలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
NTR Bharosa Pension: దూపాడు గ్రామంలో కోలాహలంగాఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గౌ“శ్రీ గూడూరి ఏరిక్షన్ బాబు (Erixion Babu) గారి ఆదేశాల ప్రకారం, ఎరాగొందపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం మండలం, దూపాడు గ్రామంలో సర్పంచ్ ఎనిబేర అనూష (Dupadu Sarpanch Yenibera Anusha) గారి చేతులమీదగా ఉదయం 6:00గ“ ల నుండే పెన్షన్ డిస్టిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.