Sarpanch Anusha: ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ అనుష గారు, గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యేవి, వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రానురాను క్రిందికి పోతున్నది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది, కనీసం 300-400 వందల అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు.
ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు ఇంకుడు గుంతలే ఒక మార్గం అని, ఈ కార్యక్రమాన్ని వ్వక్తి గతంగానే కాకుండా సామాజిక పరంగా కూడా భారీ ఎత్తున చేపట్ట గలిగితే సరైన ప్రతి ఫలము పొందగలరని. గ్రామ సర్పంచ్ ఎనిబేర అనూష గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో దూపాడు ఫీల్డ్ అసిస్టెంట్ మహమ్మద్ హుసేన్ పాల్గొన్నారు.