Sarpanch Anusha: ఎర్రగొండపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని (SWPC) పరిశీలించిన DPO వెంకట నాయుడు గారు, మార్కాపురం DLPO Y భాగ్యవతి గారు,దూపాడు గ్రామ సర్పంచ్ ఎనిబెర అనూష గారు. ఈ సందర్బంగా SWPC కేంద్రాన్ని త్వరగతిన అందుబాటులో తీసుకురావాలని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా వచ్చే సంపద లాభాలను ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.
గ్రామాల నుండి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తారు, అక్కడ తడి, పొడి వ్యర్థాలను వేరు చేస్తారు, ఈ కేంద్రాల ద్వారా పారిశుధ్యం మెరుగుపడుతుంది, వ్యర్థాలను తగ్గించవచ్చు, మరియు పర్యావరణానికి మేలు జరుగుతుంది, ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడానికి ఈ కేంద్రాలను ప్రోత్సహిస్తుంది
ఈ కార్యక్రమంలో ఆళ్ళ నాసర్ రెడ్డి ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి, దూపాడు గ్రామ సర్పంచ్ ఎనిబెర అనూష గారు, EOPR రామసుబ్బయ్య, పంచాయత్ సెక్రటరీ బాలకోటయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు…